కాకి రెక్క నందైన కన్నయ్యా
నీ మేనిరంగు మురిపించె నల్లనయ్యా ॥కాకి॥
వనమంత పరికింప వనమాలీ
నీ హరితఛాయ హాయినిచ్చె హరిగోవిందా ॥కాకి॥
వీనులజేరు సవ్వడులన్నీ వేణువిలోలా
నీ గానమై అలరించె ఆనందరూపా
మంటలోన వేలిడినా మాధవా
నీ వంటినంటు పులకింత శ్రీవెంకటేశ ॥కాకి॥
తమిళ కృతి - శ్రీ సుబ్రమణ్య భారతి
స్వేఛ్చానువాదం - శ్రీరామ మూర్తి
రాగం - బృందావన సారంగ
తాళం - ఆది
You can find my rendition of the song here.
No comments:
Post a Comment